సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో బుధవారం పలు సేవాకార్యక్రమాలతోపాటు రక్తదాన శిబిరాలను నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వర్ని మండలం సిద్ధాపూర్లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రక్తదాతలను అభినందించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రక్తదానం చేశారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ప్రభుత్వ పాఠశాలలో నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా శాంతి కపోతాన్ని ఎగురవేశారు. బిచ్కుందలో ఎమ్మెల్యే షిండే ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.