నవనాథపురంలో ప్రభం‘జనం’.. సిద్దులగుట్ట చెంతన విరబూసిన గులాబీవనం.. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు వెల్లువెత్తిన ప్రజాభిమానం.. ప్రజానీకం ఉత్తుంగ తరంగమై తరలిరాగా, ఆర్మూర్‌లో కేసీఆర్ సభ దిగ్విజయవంతమైంది. జన సునామీని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ మురిసిపోయారు. ఇది జనమా.. ప్రభంజనమా అని అచ్చెరువొందారు. ఆర్మూర్ అంతా ఇక్కడే ఉన్నదా అన్నట్లు అనిపిస్తున్నది. ఈ జనాలను చూస్తే జీవన్‌రెడ్డి గ్యారంటీగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమనిస్తోందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలని, అభ్యర్థితో పాటు పార్టీని కూడా చూసి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ఎర్రజొన్న రైతులపై కాల్పులు జరిపించిన కాంగ్రెస్‌ను నమ్మొద్దని పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. మరోవైపు, జన ప్రభంజనాన్ని చూసి ప్రతిపక్షాల్లో గుబులు మొదలైంది.
నిజామాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జనమా ప్రభంజనమా అన్నట్లు ఆర్మూ ర్ ప్రజా ఆశీర్వాద సభ ఉన్నదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే సముద్రాన్ని తలపిస్తున్నద న్నారు. ఆర్మూర్ అంతా ఇక్కడే ఉన్నదా అన్నట్లుగా కనిపిస్తోందని తెలిపారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూసిన తర్వాత ఆర్మూర్‌లో జీవన్ రెడ్డి గ్యారంటీగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయంగా కనిపిస్తున్నదని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎర్రజొన్న రైతుల కోసం ఆమరణ దీక్ష చేసి న వ్యక్తి జీవన్ రెడ్డి అని తెలిపారు. ఎర్రజొన్న రైతులపై కాల్పులు జరిగిన నాడు కరీంనగర్ పర్యటనలో ఉన్న తాను హుటాహుటిన టూర్‌ను రద్దు చేసుకుని ఆర్మూర్‌కు వచ్చినట్లు సీఎం వివరించారు. ఆర్మూర్ పట్టణ శివారులో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన బీఆర్ఎస్ అధినేత ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. పదేండ్ల తెలంగాణలో సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు రాబోయే రోజుల్లో అమలు చేయబోయే కార్యక్రమాల సరళిని కేసీఆర్ ప్రజలకు వివరించారు.
ఉద్యమంలో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే లేక మునుపు ఎర్రజొన్న రైతుల కోసం జీవన్‌రెడ్డి పాటుపడ్డారని చెప్పారు. పోలీసు కా ల్పుల సమయంలో ఇక్కడికి వచ్చిన నాడే జీవన్ రెడ్డి తనకు సన్నిహితుడై కుటుంబ సభ్యుడిగా మారారని వివరించారు. పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడు అని చెప్పారు. ఏదైనా పని కోసం వెంటపడి సాధించే రకమన్నారు. ఆలూర్, డొంకేశ్వర్ మం డలాలు కావాలన్నప్పుడు… నేను అవసరమా? అని ప్రశ్నిస్తే మూడు రోజులు అలిగి కూ ర్చున్నారంటూ చెప్పా రు. నమ్ముకున్న ప్రజల కో సం తప్పకుండా పనులు చేయించుకునే వ్యక్తి అని కీర్తించారు. జీవన్ రెడ్డిపై ప్రజల అభిమానం పెద్ద ఎత్తున కనిపిస్తున్నదని చెప్పారు. ఎలక్షన్లు వచ్చినందున బరిలో ఎవరో ఒకరు నిలబడతారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు స్వతంత్రులు ఉంటారన్నారు. అభ్యర్థి మంచి చెడ్డా చూడడంతో పాటు అభ్యర్థి వెనుక పార్టీలను చూడాలన్నారు. గెలిపించే ఎ మ్మెల్యే ద్వారా ప్రభు త్వం ఏర్పడుతుందన్నారు. పార్టీ చరిత్ర ఏంది. నడవడిక ఏంది. పద్ధతి ఏమున్నది. ఎవరు రాజ్యం చేసినప్పడు ఏం నడక నడిచారో అర్థం చేసుకోవాలన్నారు. పార్టీల దృక్పథం, ఆలోచన సరళి ఎట్లున్నదో ఆలోచించి ఓటేస్తే లాభం జరుగుతుందని హితవు పలికారు. ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆగమాగం అవుతుందన్నారు.
మహారాష్ట్రలో నీటి తీరువా అమలవుతున్నదని, తెలంగాణలో నీటి తీరువా రద్దు చే శామని కేసీఆర్ వెల్లడించారు. కరెంట్ ఫ్రీ అందుతుందన్నారు. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటున్నదన్నారు. రైతులు షావుకారి వద్ద చేయి చాపకుండా సొంత పెట్టుబడితో వ్యవసాయం చేసుకునేంతగా ఎదిగితే అదే బంగారు తెలంగాణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కరెంట్ సక్కగా ఇయ్యలేదని, ఆ బాధలు అందరికీ తెలుసన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే డబ్బులు వసూలు చేసే పైరవీకారులు మన గ్రామాల్లోనే ఉండేదని పాత రోజులను గుర్తు చేశారు. మోటరు వైండింగ్ చేసే దుకాణాలు దివా లా తీశాయన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను 24గంటలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని.. ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలోనూ ఉచిత కరెంట్ ఇయ్యట్లేదన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం, బాగు చేయాలని పని చేశామన్నారు. రైతుబంధు ద్వారా ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ చెబుతున్నారని, పీసీసీ అధ్యక్షుడు 24గంటల కరెంట్ వేస్ట్ అంటున్నారని కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. 3 గంటలిస్తే పొలం పారుతదని కాంగ్రె స్ నేతలే అంటున్నారని పేర్కొన్నారు. అంజుమాన్కు అప్పులైతే తలుపులు పీక్కు పోయిన రోజులు కాంగ్రెస్ కాలంలో చూడలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు వాళ్లు వచ్చి ఓట్లు అడుగుతున్నారని, సీఎం అని చూడకుండా దురుసుగా మాట్లాడుతున్నారని చెప్పారు. సమాధానం మీరే చెప్పాలంటూ ప్రజలకు కేసీఆర్ తెలిపారు. దళితబంధు పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఈ పథకం ఉండాలని ఎవరి మైండ్ కు కూడా రా లేదన్నారు. ఆదాయం పెరిగినా కొద్ది పథకాలు పెం చుకున్నామన్నారు. బీడీ కార్మికులు ఇక్కడ ఎక్కువ. 19రాష్ర్టాల్లో బీడీ కార్మికులకు పింఛన్లు ఇయ్యరు. మనమే ఇస్తున్నం.టేకేదార్లకు పింఛన్లు ఇస్తున్నం.
వివిధ సభల్లో వచ్చిన వినతులు, విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో కొత్త వారికి బీడీ కార్మిక పింఛన్లు ఇచ్చేందుకు ఆలోచన చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తామంటున్నారని, తీస్తే ఏమైతదో ఆలోచన చేయాలని రైతులను కోరారు. రైతుబంధు, రైతుబీమా ద్వారా వచ్చే డబ్బులు, ధాన్యం కొనుగోళ్లతో వచ్చే డబ్బులన్నీ ధరణితోనే రైతు అకౌంట్లో జమ అవుతున్నాయన్నారు. ధరణి లేకపోతే పైరవీకారులు పుట్టుకొస్తారన్నారు. మళ్లీ మొదటికి వస్తుందని వైకుంఠం ఆటలో పెద్ద పాము మింగినట్లు అవుతుందన్నారు.
ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారని పంటలు బ్రహ్మాండంగా పండిస్తారని కేసీఆర్ చెప్పారు. అంకాపూర్ తనకు ప్రాణంతో సమానం అంటూ చెప్పారు. అంకాపూర్‌ను తాను ప్రచారం చేసినంతగా ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదని చెప్పారు. అంకాపూర్ చైతన్యంతో చాలా గ్రామాలు రాష్ట్రంలో ముందుకు వచ్చాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రావాల్సిన మెచ్యూరిటీ మన దగ్గర రాలేదన్నారు. ఎలక్షన్లు వస్తే అడ్డగోలుగా మాట్లాడడం, అబద్ధాలు, బద్నాములు చేయడం భారతదేశంలో కొనసాగుతుందన్నారు. ఓటు అనే వజ్రాయుధం జాగ్రత్తగా వినియోగించాలన్నారు. ఓటు అనేది మన తలరాతను మార్చుతుందన్నారు. 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేసినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే రాష్ట్ర సాధన కోసమని, ఆ తర్వాత రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తున్నామో మీ కండ్ల ముందు ఉన్నదంటూ ప్రజలకు వివరించారు. కొత్తగా రాష్ట్రం వచ్చిన నాడు ఏదీ సక్కగా లేదని, కొత్త కుండలో ఈగ సొచ్చినట్లు భయంకరమైన పరిస్థితులను ఒక్కోటి దాటుకుంటూ వచ్చామన్నారు. ఆరు నూరైన సరే కచ్చితంగా వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలని, గ్రామాలు ఆర్థికంగా పటిష్టవంతం కావాలని నిర్ణయించుకుని పని చేశామన్నారు. రైతుబంధుకు ఎవరైనా దరఖాస్తు చేశారా. అలాంటి రైతుబంధును పుట్టించింది కేసీఆర్ మాత్రమేనన్నారు.పథకాన్ని ఎం.ఎస్. స్వామినాథన్ స్వయంగా సీఎం ఆఫీస్ దాకా వచ్చి శభాష్ అన్నారని గుర్తుకు తెచ్చుకున్నారు. ఐక్యరాజ్య సమితి సై తం గొప్ప పథకమని కితాబునిచ్చిందని కేసీఆర్ వెల్లడించారు.