ఎల్లారెడ్డి రూరల్ : పెళ్లి వేడుకల్లో ( Wedding celebrations ) మద్యం తాగిన గొడవకు దిగిన వ్యక్తిపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన కామారెడ్డి ( Kamareddy ) జిల్లా ఎల్లారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ ( SI Shivakumar ) తెలిపిన వివరాల ప్రకారం .. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మాగి రాములు (45) అనే వ్యక్తి తన బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి మహమ్మద్ నగర్ మండలం పరిధిలోని గాలిపూర్ గ్రామానికి వెళ్లాడు.
వివాహ వేడుకలలో రాములు మద్యం సేవించిన అనంతరం గొడవ జరిగింది. గొడవ తీవ్రం కావడంతో అక్కడికి వచ్చిన వారు అతడిపై దాడి చేయడంతో స్పృహ కోల్పోయ్యాడు. భార్య తులసమ్మ బుధవారం అర్ధరాత్రి రాములు ఎల్లారెడ్డి ఆసుపత్రిలో చేర్పించగా గురువారం చికిత్సపొందుతూ చనిపోయాడని ఎస్సై పేర్కొన్నారు. మృతుడు రాములు భార్య తులసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.