కామారెడ్డి, మే 13 : గత యాసంగితో పోలిస్తే ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్బాబు తెలిపారు. టేక్రియాల్లో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందంతో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..
రబీ సీజన్లో ఇప్పటి వరకు 41,309 మంది రైతు ల నుంచి రూ.518 కోట్ల విలువైన 2 లక్షల 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. అకాల వర్షాలతో తల్లడిల్లుతున్న రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా కొనుగోలు కేంద్రాలకు వచ్చి న ధాన్యాన్ని వెనువెంటనే తూకంవేసి రైస్ మిల్లులకు తరలించాలని, మిల్లర్లు కూడా ధాన్యాన్ని త్వరగా అన్లోడ్ చేసి ట్రక్ షీట్ జారీ చేయాలని ఆదేశించారు. కేంద్రంలో తూకం వేసి ఉం చిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలన్నారు.