కోటగిరి, జనవరి 13 : వాహనదారులు వాహనం నడిపే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడపవద్దని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ సర్కిల్ సీఐ కృష్ణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం, ఎత్తొండ క్యాంప్ లో వాహనదారులకు పలు అంశాల పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అన్నారు. డ్రైవింగ్ చేసేవారికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు వాహనం పత్రాలు ఉండాలని సూచించారు.
అతివేగంగా వాహనం నడపవద్దని రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ఇక మీదట వాహనం నడిపేటప్పుడు మద్యం సేవించమని హెల్మెట్ ధరిస్తామని అత్యధికంగా నడపమని ప్రతిజ్ఞ చేశారు. ఒకవేళ మద్యం తాగి వాహనం నడిపినట్లయితే ప్రమాదం జరిగితే కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉంటుందని కాబట్టి కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని వాహనాలు జాగ్రత్తగా నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ కృష్ణ తో పాటు కోటగిరి ఎస్సై సునీల్, సర్పంచులు గైని వీరమణి అర్జున్, ఉప సర్పంచ్ తరుణ్ సాయితేజ. ఎత్తొండ సర్పంచ్ శ్వేత, మాజీ ఉప సర్పంచ్ సుజాత, గ్రామస్తులు పాల్గొన్నారు.