ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్రిస్మస్ పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులతో చర్చిలన్నీ కిటకిటలాడాయి. క్రిస్మస్ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన చేశారు. ఆయా చర్చిల్లో ఫాదర్లు, పాస్టర్లు ఏసు సందేశాలను చదివి వినిపించారు.

క్రిస్మస్ను పురస్కరించుకొని పలువురు ఎమ్మెల్యేలు చర్చిలను సందర్శించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రీస్తు బోధనలపై ప్రసంగించారు. కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
