ఉమ్మడి జిల్లాలో బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డిలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా చేసిన ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి. చిన్నారులు వివిధ వేషధారణల్లో మురిపించారు. ఏసు బోధనలు అనుసరణీయమని, ప్రేమ, క్షమగుణాలను అలవరచుకోవాలని, ఏసు చూపిన మార్గంలో నడవాలని పాస్టర్లు, ఫాదర్లు సూచించారు.