Nizambad | పోతంగల్, నవంబర్ 17: కుక్కల బారి నుండి అధికారులు రక్షించాలని కోరుతూ మండల కేంద్రంలో చిన్నారులు, కాలనీ వాసులతో కలిసి వినూత్న రీతిలో ప్లకార్డ్ లు పట్టుకొని సోమవారం ప్రదర్శించారు. కాలనీవాసులు మాట్లాడుతూ వీధి కుక్కలు చిన్న, పెద్ద తేడా లేకుండా విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయని, ఒంటరిగా పిల్లను బయటకు పంపడానికి జంకుతున్నామని వాపోయారు.
రాత్రి వేళల్లో ఎటు చూసినా గుంపులు గుంపులుగా కుక్కలు వీధుల్లో తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవార్లు మొరుగుతూనే ఉంటాయని, చిన్న లేగదూడలను ఎత్తుకెళ్లి దాడులకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని కోరారు.