బాన్సువాడ, మే 3: ఇంటి ఆవరణలో నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసుకున్న ఓ బావిలో ఇద్దరు చిన్నారులు పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటన బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగమేశ్వర్ కాలనీకి చెందిన ఇర్ఫాన్ (7), రహెలా (7) ఇద్దరు చిన్నారులు శనివారం రాత్రి తమ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నారు. అయితే ఇంటి యజమాని ఇంటి అవసరాల కోసం రింగుల బావి ఏర్పాటు చేయించగా.. ప్రస్తుతం ఆ బావి అడుగంటిపోయింది.
దీంతో వాటిపై రింగులు వేసి ఉంచారు. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్న క్రమంలో బావిపైకి ఎక్కగా ఒక్కసారిగా సిమెంట్ రింగులు కూలిపోవడంతో చిన్నారులిద్దరూ అందులో పడిపోయారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబీకులు వెంటనే బాన్సువాడ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉం దని అక్కడి వైద్యులు చెప్పడంతో నిజామాబాద్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇర్ఫాన్ పరిస్థితి విషమంగా ఉన్న ట్లు తెలిసింది.