పోతంగల్ మార్చ్ 2 : వెలవెలబోయిన చికెన్ షాపులు కలకలాడుతున్నాయి. బర్డ్‌ఫ్లూ ప్రభావంతో చికెన్ అమ్మకాలు(Chicken sales) పడిపోయిన విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి కారణంగా చికెన్ తినడం ప్రజలు తగ్గించేశారు. గత 15 రోజులకు ఇప్పటికీ చూస్తున్నట్లయితే చికెన్ అమ్మకాలు పెరిగాయి. అని చెప్పవచ్చు. ఎక్కువ ఉడికించిన చికెన్ తింటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని అధికారులు కొన్ని ప్రకటనల ద్వారా చెప్పడంతో చికెన్ ప్రియులు చికెన్ కొనుగోలు చేస్తున్నారు.
మండలంలో ప్రతి వారం వ్యాపారులు నాలుగైదు క్వింటాళ్ల చికెన్ విక్రయించేవారు. బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని రోజులుగా ప్రజలు చికెన్ తినడం తగ్గించడంతో సగానికిపైగా అమ్మకాలు తగ్గాయి. దీంతో గత నెల రోజులుగా వెలవెలబోయిన చికెన్ షాపులు ఇప్పుడు కలకలాడుతున్నాయి. అయితే ఈ వారం రోజులుగ చికెన్ అమ్మకాలు పెరిగాయని వ్యాపారాలు చెబుతున్నారు. ఎలాంటి వదంతులు నమ్మకుండా చికెన్ ఉడికించి తినడం వల్ల ఎలాంటి నష్టం జరగదుఅని అంటున్నారు.