ఉమ్మడి జిల్లాలో సోమవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూరా ర్యాలీలు నిర్వహించి, శివాజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పలుచోట్ల శివాజీ విగ్రహాలను స్థానిక ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆదర్శవంతుడైన పాలకుడని కొనియాడారు.