శక్కర్ నగర్ : బోధన్ (Bodhan) పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చత్రపతి శివాజీ (Chhatrapati Shivaji) జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. చత్రపతి శివాజీ విగ్రహ వ్యవస్థాపకులు పసుపులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
డీసీసీబీ మాజీ చైర్మన్, బోధన్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్ రావు పట్వారి, పలువురు ప్రముఖులు మాట్లాడుతూ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషిచేసిన, పోరాడిన యోధుడు శివాజీ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత శివాజీ అడుగుజాడల్లో నలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ చైర్ పర్సన్ అంకు సంధ్యాదాము, బోధన్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, నాయకులు బెంజర్ గంగారాం, శ్రీకాంత్ గౌడ్, గంగాధర్ గౌడ్, అంకు మహేష్, డాక్టర్ సుధాకర్, గౌతమ్ గౌడ్, లోకేష్, లింగం, కిరణ్, శ్రీకాంత్, విజయ్, శ్రీను, రాజు తో పాటు పలువురు పాల్గొన్నారు.