చందూర్ : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో జీవన్ సేవ ( Jeevan Seva) వెల్నెస్ గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరం ( Medical camp ) విజయవంతం అయ్యింది. ఇందులో భాగంగా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందజేశారు. ఇందులో భాగంగా సుజోక్ థెరపీ, మసాజ్ థెరపి, ఆక్యుపంక్చర్, నేచురోపతి చికిత్సలను గ్రామస్థులకు ఉచితంగా అందజేశారు. అదేవిధంగా రోగులకు సలహాలు, సూచనలు అందజేశారు. గ్రామంలో 50 శాతం మంది ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారని జీవన్ సేవ వెల్నెస్ గ్రూప్ వైద్యులు తెలిపారు.