ఆర్మూర్‌టౌన్, మే 15: ఆటోలో వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామానికి చెందిన బొబ్బిలి లక్ష్మి చైన్ స్నాచింగ్‌పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పట్టణంలోని పెర్కిట్ బైపాస్ వద్ద పోలీసులు గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు.
అటుగా వచ్చిన ఏడుగురిపై అనుమా నంతో అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తాము చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నట్లు వారు ఒప్పుకున్నారు. మహారాష్ట్రకు చెందిన వారు నిర్మల్ జిల్లా తిమ్మాపూర్, మంజులాపూర్ ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటూ.. మహిళల మెడలో నుంచి బంగారం గొలుసులు చోరీ చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు, ఒక ట్రాక్టర్, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన పోలీసులకు సీపీ అవార్డులు అందజేశారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయ ణ గౌడ్ పాల్గొ న్నారు.