Nizamabad | నిజామాబాద్, పిబ్రవరి 21 : సెంచరీ మ్యాట్రెసెస్, సోఫాస్ ఆధ్వర్యంలో నగరంలోని రుక్మిణి చాంబర్స్ వద్ద సోమవారం కొత్త సెంచరీ మ్యాట్రెసెస్ స్టోర్ని ఆ సంస్థ ఈడీ ఉత్తమ్ మలానీ జ్యోతి ప్రజ్వాలన చేసి నూతన స్టోర్ ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం సరైన నిద్ర ఒకటే పరిష్కారమని అటువంటి నిద్రని సెంచరీ మ్యాట్రెసెస్ ఎంచుకోవాలని అన్నారు.
సెంచరీ మ్యాట్రెసెస్ లో ఆర్థోపెడిక్ మ్యాట్రెసెస్, మెమొరీ ఫోమ్ సొల్యూషన్స్, అడ్వాన్స్డ్ స్ర్పింగ్ సిస్టమ్స్, ఎర్గోనోమిక్ సోఫాలతో కూడిన ఉత్పత్తులను అందిస్తున్నామని, హై డెన్సిటీ ఫోమ్ టెక్నాలజీ, కూలింగ్ కంఫర్ట్ లేయర్స్, యాంటీ మైక్రోబియల్ ప్రొడక్షన్ సొల్యూషన్స్ తో తయారు చేశామని వివరించారు. నూతన బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా మ్యాట్రెసెస్ కొనుగోలు పై 20 శాతం తగ్గింపు దానితోపాటు పిల్లోస్, బెడ్ షీట్లు, మ్యాట్రెస్ ప్రొటెక్టర్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు.
యాక్సెసరీలపై బై వన్ గెట్ వన్ ఆఫర్ అందుబాటులో ఉందని అన్నారు. కొనుగోలు చేసే వారికి సోఫాలపై 40 శాతం వరకు తగ్గింపు కలదని అన్నారు. అంతేకాకుండా ఫైనాన్స్ సౌకర్యాలు కూడా అందిస్తున్నామని, ఉచిత డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంచరీ మ్యాట్రెసెస్ అండ్ సోఫాస్ ఉద్యోగస్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.