Kamareddy | కామారెడ్డి : పెండ్లి తంతు ముగించుకొని తిరిగి వెళ్తుండగా కారు బోల్తా పడిన ఘటన సోమవారం ఉదయం ఉప్పల్ వాయి గ్రామంలో చోటు చేసుకుంది. రామారెడ్డి ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. మాచారెడ్డి మండలం సోమర్ పేట్ లో వివాహ కార్యక్రమం పూర్తి చేసుకుని గాంధారి కి ఆరుగురితో సోమవారం ఉదయం 3 గంటలకు వెళుతున్న కారు ఉప్పల్ వాయి గ్రామంలో అదుపు తప్పి పశువుల పాకను ఢీకొట్టింది.
ఈ ఘటనలో గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గమనించిన స్థానికులు, పోలీసులు బాధితులను వెంటనే కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. గాయపడిన వారి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.