Accident | మాచారెడ్డి: రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన రెండు బైకులను, అక్కడే చాయి తాగుతున్న ఇద్దరిని కారు ఢీకొట్టిన ఘటనలో బైకులు ధ్వంసమవడంతో పాటు ఇద్దరికి గాయాయాలయ్యాయి. ఈ ఘటన మాచారెడ్డి మండలంలోని గజ్యనాయక్ తండా చౌరస్తా లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికు కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన భక్తులు వేములవాడకు దర్శనం కోసం కార్లో వెళ్తున్నారు.
రాత్రి ఒకటి గంటలకు బయలుదేరిన భక్తులు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా రోడ్డు పక్కన చాయ్ తాగుతున్న ఇద్దరూ కూలీలతో పాటు మూడు బైకులను కారుతో ఢీకొట్టాడు. ఈ ఘనటలో ఇద్దరు కూలీలకు గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే వారిని అంబులెన్స్ లో కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.