అర్గుల్ వద్ద బస్సు ప్రమాదం
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో అనుభవం లేని డ్రైవర్లు బస్సులను నడపడం ప్రజల ప్రాణాలమీదికి వస్తున్నది. ఇందుకు తాజాగా మండలంలోని అర్గుల్ జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదమే నిదర్శనం.
- వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిన లారీ
- డివైడర్‌పైకి దూసుకెళ్లిన పల్లె వెలుగు
- బస్సులోని ప్రయాణికులకు గాయాలు
- అనుభవంలేని డ్రైవర్లతో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు!
జక్రాన్‌పల్లి, ఏప్రిల్ 24 : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో
అనుభవం లేని డ్రైవర్లు బస్సులను నడపడం ప్రజల ప్రాణాలమీదికి వస్తున్నది. ఇందుకు తాజాగా మండలంలోని అర్గుల్ జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదమే నిదర్శనం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కామారెడ్డి నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్మూర్ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ప్రమాదానికి గురైంది.
కామారెడ్డి నుంచి ఆర్మూర్‌కు ప్యాసింజర్లను ఎక్కించుకుని వస్తుండగా అర్గుల్ వద్ద ఓ ప్రయాణికుడిని దింపడానికి డ్రైవర్ బస్సును ఆపాడు. సదరు ప్రయాణికుడు దిగిన తర్వాత బస్సు తీస్తుండగా వెనుక వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు పక్కనున్న డివైడర్‌పైకి ఒక్కసారిగా దూసుకెళ్లగా, బస్సులో 20 మంది ఉండగా 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే బస్సును ఢీకొట్టిన లారీని మరో లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో లారీ ముందుభాగం ధ్వంసమైంది. అనుభవంలేని డ్రైవర్లతో బస్సులను నడిపించడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులతో పూర్తిస్థాయిలో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

