భీమ్‌గల్: భారత రాజ్యాంగాన్ని కించపర్చే విధంగా మాట్లాడిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మను నిజామాబాద్ భీమ్‌గల్ పట్టణ కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అరవింద్‌ను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నర్సయ్య, కోఆప్షన్ సభ్యుడు పర్స నవీన్, లాల సాగర్ తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా ఎంపీ అరవింద్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షుడు జన్నెపల్లి రంజిత్ ఎస్‌హెచ్‌వో సైదేశ్వర్కు ఫిర్యాదు చేశారు. దళితులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.