బాన్సువాడ రూరల్, మార్చ్ 03: బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ డైరీ, క్యాలెండర్లను(BRS party Calendar )సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి ప్రజా సమస్యలకు సంబంధించిన విషయాలు డైరీలో రాసి తెలంగాణ భవన్లో అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. గ్రామాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.
రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ పోరాడుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టకు నాయకులు కలిసి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు భాస్కర్, శివరాజులు, సాయిలు, శివ, కాశిరాం, గణేష్, సునీల్, రత్న తదితరులు పాల్గొన్నారు.