Bajireddy Goverdhan | బాన్సువాడ : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలంలో గురువారం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి సభ్యత నమోదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్, బాన్సువాడ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జి తోట ఆగయ్య పాల్గొన్నారు. కాగా రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండలాలకు సంబంధించిన గులాబీ పార్టీ కార్యకర్తలతో ఈ సమావేశం నిర్వహించారు.