Former MLA Gampa Govardhan | కామారెడ్డి : కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఆధ్వర్యంలో స్థానిక 35 వ వార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ మునిరోద్దీన్ సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మునిరోద్దీన్కు మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ బీఆర్ఎస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి శూన్యమని, బీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని అన్నారు.
అందుకే బీఆర్ఎస్లో చేరినట్లు మునిరోద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోలీస్ కృష్ణాజిరావు, కాసర్ల స్వామి, పెద్దోళ్ల శశిధర్ రావు, నిట్టు నారాయణ రావు, కృష్ణ యాదవ్, నీలం రాజలింగం, నీలం దుర్గా ప్రసాద్,ద్యావరీ నరేష్, మీసాల సత్యం, ఇస్రోజీ వాడి బాలకిషన్, మీసాల నవీన్, విశాల్ కుమార్, భాను ప్రకాష్, అనుదీప్, వంగ సుజిత్ కుమార్, నవీన్, కిట్టు, శేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.