బాన్సువాడ టౌన్, ఫిబ్రవరి 6: బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
బాన్సువాడ పట్టణంలోని కొల్లూర్ రోడ్ సమీపంలో ఉన్న ఎస్ఎంబీ ఫంక్షన్హాల్లో బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.