ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్ వేటు విధించడం ఎంతవరకు సమంజసం అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బాన్సువాడ, బోధన్, రెంజల్, నవీపేట, ఎడపల్లిలో బీఆర్ఎస్ నాయకులు శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు రాస్తారోకో నిర్వహించారు.
-బాన్సువాడ/ శక్కర్‌నగర్/ రెంజల్/ నవీపేట/ఎడపల్లి, మార్చి 15
బాన్సువాడలోని ప్రధాన రహదారిపై మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు షేక్ జుబేర్, మోచి గణేశ్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎన్నికల సందర్భం గా అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల రవీంద్రభారతిలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌పై చేసి న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆందోళనకారులకు పోలీసులు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.
రెంజల్ మండలంలోని సాటాపూర్ తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ మండల మాజీ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసి, ధర్నా చేపట్టారు. అంతకుముందు దిష్టిబొమ్మకు ఊరేగింపు నిర్వహించారు. రాఘవేందర్‌యాదవ్ మాట్లాడుతూ.. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ను బేషరతుగా వెనక్కు తీసుకొని అసెంబ్లీ సభా మర్యాదలను కాపాడాలని కోరారు.
నవీపేటలోని శివాజీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం రాస్తారోకో నిర్వహించారు. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో చేస్తున్న ప్రదేశానికి స్థానిక ఏఎస్సైలు మోహన్‌రెడ్డి, యాదగిరిగౌడ్ చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తెడ్డుపోశెట్టి, నవీపేట సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు న్యాలకంటి అబ్బన్న, దొంత ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఎడపల్లి మండ ల కేంద్రంలోని సాటాపూర్ గేట్ సమీపం లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహ నం చేశారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీరాం, మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ ఆకుల శ్రీనివాస్, నాయకులు హన్మాండ్లు, సురేశ్‌గౌడ్, దశరథ్ పాల్గొన్నారు బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పట్ట ణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు రవీందర్‌యాదవ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే సభ నుంచి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో సీఎం రేవంత్‌రెడ్డికి అసహనం పెరుగుతోందన్నారు. తక్షణమే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.