నస్రుల్లాబాద్/ చందూర్ (మోస్రా)/బిచ్కుంద, అక్టోబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం వానకాలానికి సంబంధించి రైతు భరోసా ఎగ్గొట్టడంపై బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతుభరోసాపై వేసిన కమిటీ రిపోర్టు వచ్చాక వచ్చే సీజన్ నుంచి భరోసా అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. సోమవారం నస్రుల్లాబాద్, చందూర్, జుక్కల్ తదితర మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, బీఆర్ఎస్ జుక్కల్ మాజీ మండల అధ్యక్షుడు నీలూ పటేల్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
కాంగ్రెస్ మోస పూరిత వాగ్దానాలతో రైతులు పూర్తిగా నష్టపోయారని అన్నారు. ఈ సీజన్లో రైతుభరోసాను ఎగ్గొట్టి రైతులను మోసం చేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రైతు భరోసా విడుదల చేయాలని, రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
నస్రుల్లాబాద్‌లో చేపట్టిన కార్యక్రమంలో నాయకులు మోచే గణేశ్ గౌడ్, నర్సింహులు గౌడ్, టేకుర్ల సా యిలు, రమేశ్ యాదవ్, మొసిన్, శేఖర్, భా స్కర్, నారాయణ, గంగారాం, అల్లం సా యిలు, చందూర్‌లో సొసైటీ మాజీ చైర్మన్ మద్దూరి మాధవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కోటగిరి రాములు, మాముళ్ల శ్రీనివాస్, పోశెట్టి, మోస్రా నాయకులు పసుల ప్రశాంత్ రెడ్డి, కోత్ మీర్ కార్ విజయ్, గంధం విజయ్, షేక్ అలీమ్, గొల్ల ప్రశాంత్, కే రాజు, మోచి గణేశ్, మహ్మద్ కరీం, మగ్బుల్, జుక్కల్ మాజీ ఉప సర్పంచ్ భానుగౌడ్, బొల్లి గంగాధర్, వాసర్వార్ రమేశ్, పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.