Armoor | ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని బీఆర్ఎస్ 28 వార్డులో నజియా అజీమ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. మరోసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వస్తేనే ఆర్మూర్ పట్టణం అభివృద్ధి చెబుతుందన్నారు.
రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేయడం వల్లే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని పలువురు పేర్కొంటున్నారు. వార్డు ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించి వార్డును అభివృద్ధి చేసుకుందామని వేడుకుంటున్నారు.