భిక్కనూరు,ఆగస్టు 26: కాచాపూర్ సింగిల్ విండో ఏర్పాటును హర్షిస్తూ భిక్కనూర్ మండలం బస్వాపూర్ సింగిల్ విండో కార్యాలయం ఎదుట తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ చిత్రపటాలకు పాలకవర్గ సభ్యులు సోమవారం క్షీరాభిషేకం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2005లో కాచాపూర్ సొసైటీని అప్పటి మంత్రి షబ్బీర్ అలీ బస్వాపూర్ సొసైటీలో విలీనం చేశారని గుర్తుచేశారు. అప్పటి నుంచి 19ఏండ్ల పాటు కాచాపూర్ సొసైటీ రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. కాచాపూర్ సొసైటీని పునరుద్ధరించాలని 2023లో ప్ర భుత్వ విప్‌గా ఉన్న గంపగోవర్ధన్‌ను కలిసి కోరగా అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో రెండు సొసైటీలుగా విభజించాలని ఉత్తర్వులు వచ్చినట్లు తెలిపారు.
కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు.. షబ్బీర్ అలీ కాచాపూర్ సొసైటీని పునరుద్ధరించారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బస్వాపూర్ సొసైటీ చైర్మన్‌గా ఉన్న కిష్ణాగౌడ్ రెండు ప ర్యాయాలు అవినీతికి పాల్పడి పబ్బం గడుపుతున్నాడని, అక్రమాలను త్వరలోనే ని రూపిస్తామన్నారు. విండో వైస్ చైర్మన్ మద్దిస్వామి, సింగిల్ విండో డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు బుర్రి గోపాల్ పాల్గొన్నారు.