Kotagiri | కోటగిరి, ఫిబ్రవరి 7 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలు విసుగెత్తిపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని చేతల ప్రభుత్వం కాదని వచ్చి రెండేళ్లలో కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ కోటగిరి మండల నాయకులు తెల్ల రవికుమార్ అన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సభకు కోటగిరి మండలం నుండి బైక్ ర్యాలీతో శనివారం తరలి వెళ్ళారు. ఈ సందర్భంగా తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరిచ్చిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన వస్తుందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. బహిరంగ సభకు తరలిన వెళ్లిన వారిలో కప్ప సంతోష్, గంగా ప్రసాద్ గౌడ్, శంకర్ గౌడ్, జలాల్, దేవేందర్, ఏత్తొండ మాజీ ఎంపిటిసి ఫారూఖ్తదితరులు ఉన్నారు.