Banswada | బాన్సువాడ , జులై 14 : రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హింస, ఆత్మత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు బీఆర్ఎస్ నాయకులు పోలిస్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి హింసను ప్రేరేపించేలా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వినతిలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ జిల్లా రైతు బంధు కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, ఆర్ ఎస్వీ నాయకులు ఎర్రవట్టి సాయిబాబా, కౌన్సిలర్ మక్బూల్, మాజీ వార్డు సభ్యులు శ్రీను, అక్బర్, ఫిరోజ్, ఖలీల్, మోచి గణేష్, రమేష్ యాదవ్, చాకలిసాయిలు, శివ సూరి, రహీం తదితరులు పాల్గొన్నారు.