Jangilodi Thanda | సిరికొండ, మార్చి 16 : సిరికొండ మండలంలోని జంగిలోడి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రామచంద్ర పల్లి తండా ప్రాథమిక పాఠశాలలో తాగునీటి సమస్యను సర్పంచ్ భూక్య గంగాధర్ పరిష్కరించారు. ఇటీవల పాఠశాలను సందర్శించిన సర్పంచ్ కు పాఠశాలలో నీటి సమస్య ఉందని ఉపాధ్యాయులు తెలపగా బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు.
దీంతో సోమవారం బోరు మోటార్ ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్థులకు తాగునీటి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎర్రన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.