Nizamabad | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ బోనాల గంగమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాలను ఊరేగింపు తీశారు. భాజా భజంత్రి లతో గ్రామంలో ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
మహిళలు బోనాలతో గంగమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామంలో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని, పాడి బాగుండాలని గంగమ్మ తల్లిని కోరుతూ ప్రతీ సంవత్సరం పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.