Isannapally | రామారెడ్డి : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో జూన్ 8న కందూరి చిన్న మల్లయ్య అనే వ్యక్తి అదృశ్యం కాగా ఆయన మృతదేహం రామారెడ్డి గ్రామ శివారులో మంగళవారం లభ్యమైంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కందూరి చిన్న మల్లయ్య (80) అనే వృద్ధుడు జూన్ 8న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కాగా కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో జూన్ 12 ఫిర్యాదు చేశారు. కాగా అప్పటి నుండి బంధువులతో పాటు పలు చోట్ల ఎక్కడ వెతికినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు.
మంగళవారం పశువుల కాపరికి దుర్వాసనతో రావడంతో అక్కడి వెళ్లి చూడగా మతదేహం కనిపించింది. ఆయన గ్రామంలోని పలువురికి తెలపగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై రాజశేఖర్, సర్పంచ్ బండి ప్రవీణ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా కందూరి చిన్న మల్లయ్య మృతదేహంగా నిర్ధారణ జరిగింది. ప్రాథమిక విచారణలో భాగంగా మృతుడు ఉరివేసుకొని మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి తరలించామని ఎస్ఐ తెలిపారు.