Banswada | బాన్సువాడ, జూన్ 14 : ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకొని బాన్సువాడ బ్లడ్ బ్యాంక్ లో ఆదివారం రోజు స్వచ్ఛంద రక్తదానం శిబిరాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సహకారంతో నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో 35 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం దానం చేయడం వల్ల ఇతరులకు ప్రాణదానం చేసినవారు అవుతారని అన్నారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన యువకులను ఆయన అభినందించారు. రక్తదానం చేసిన యువకులకు డాక్టర్ శ్రీను నాయక్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందచేశారు. బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తదాతలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అచ్చుకట్ల జీవన్, బ్లడ్ బ్యాంక్ పీఆర్వో ఆనంద్, ల్యాబ్ టెక్నీషియన్లు శ్రీనివాస్, రాఘవేందర్, ఎబినైజర్, రక్త దాతలు తదితరులు పాల్గొన్నారు.