NIZAMABAD | కంఠేశ్వర్ ఏప్రిల్ 17 : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ గాపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమంగా ఈడీ కేసులు పెట్టి చార్జిషీట్ నమోదు చేసిందని కాంగ్రెస్ ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వేణు రాజు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గురువారం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనాన్ని బయటకు తీసి ప్రతీ పేద వాడి అకౌంట్లో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రశ్నించే గొంతుక అని, అయనను కట్టివేయాలని అక్రమంగా ఈడీ కేసులు పెట్టించి చార్జిషీట్ నమోదు చేశారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుమన్, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షులు రేవతి, ఫిషర్మెన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పూల ఉష, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బింగి మధుసూదన్, డిసిసి డెలిగేట్ లవంగ ప్రమోద్,రాజ్ గగన్, కౌశిక్, హరీష్, మలేక బేగం, ఆడే ప్రవీణ్ కుమార్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.