Kotagiri voter list | కోటగిరి, ఆగస్టు 8 : ఓటర్ లిస్టులో చాలా ఓట్లు తప్పుల తడకగా ఉన్నాయని, కావున అధికారులు ఓటర్ లిస్టులోని తప్పులను సరిచేయాలని బీజేపీ కోటగిరి మండల అధ్యక్షుడు ఏముల నవీన్ డిమాండ్ చేశారు. కోటగిరి తహసీల్దార్ గంగాధర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏముల నవీన్ మాట్లాడుతూ కోటగిరి గ్రామానికి చెందిన ఓటర్ లిస్టులో ఉన్నతప్పులను సరిచేయాలని, కోటగిరి గ్రామానికి చెందిన ఓ పురుషుడికి ట్రాన్స్ జెండర్ గా ఓటర్ లిస్టులో చూపించడం సిగ్గుచేటన్నారు.
పోచారం సురేందర్ రెడ్డికి కోటగిరిలో నివాసం లేకపోయినా ఓటు ఎలా వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. వెంటనే ఆయన ఓటును కోటగిరి ఓటర్ లిస్టు నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. చాలా మందికి డబుల్ ఓట్లు వచ్చాయని, డబుల్ ఓట్లను అధికారులు వెంటనే సరి చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ లిస్టులో చనిపోయిన వారిని సైతం 50 కి పైగా ఓట్లు ఉన్నాయని వారిని ఓటర్ లిస్టు నుండి డిలీట్ చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు హౌగిరావు దేశాయ్, మామిడి శ్రీనివాస్, వడ్ల శ్యాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.