లింగంపేట్ : ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ (BJP) నాయకులు శనివారం లింగంపేట మండల కేంద్రంలో విస్తృతంగా ప్రచారం (MLC election) నిర్వహించారు. లింగంపేట బీజేపీ మండల అధ్యక్షులు బొల్లారం క్రాంతికుమార్ , కార్యకర్తలు దాసరి అనిల్ రాజారామ్, సాయి తేజ, చెన్నం సాయిలు, చిలుక ప్రవీణ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
బీజేపీ తరుఫున గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంజిరెడ్డిని, ఉపాధ్యాయ అభ్యర్థిగా కుమారయ్యను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఉద్యోగులకు లాభం చేకూరే విధంగా ఆదాయం పన్నును తగ్గించారని గుర్తు చేశారు. బడ్జెట్లో 15 శాతం విద్యా రంగానికి కేటాయించే విధంగా , స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు , ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు .