CPI KOTAGIRI | కోటగిరి : బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు. మే డే సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో సీపీఐ, ఏఐటియుసీ ఆధ్వర్యంలో గురువారం మే డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోటగిరి బస్టాండ్ వద్ద ఎర్ర తోరణాలతో కార్మికులు మే డే ను పండుగలా జరుపు కున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జెండాను విఠల్ గౌడ్ ఆవిష్కరించారు.
ఏఐటీయూసీ జెండాను నల్లగంగాధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విఠల్ గౌడ్ కూడా మాట్లాడుతూ యంత్రాలుగా కాకుండా మనుషులుగా గుర్తించాలని అన్నారు. కార్మికులకు ఎనిమిది గంటల పని 8 గంటల విశ్రాంతి, 8గంటల వినోదం కల్పించాలని, సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1886లో మే 1న పోరాడి హక్కులను సాధించుకున్న సందర్బంగా స్ఫూర్తితోనే మే డేను నిర్వహిస్తున్నారని అన్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే పార్టీలు ఎర్రజెండా పార్టీ ఒకటేనని కొత్తపల్లి విండో చైర్మన్ సునీల్ అన్నారు. ఈ కార్యక్రమంలో దూద నాయక్, మేదరి శివ సున్నం శరత్, నీలి శంకర్, పవన్ సంజు, మేకల సాయిలు, వీరేశం, నీలి దత్తు రాజు పాల్గొన్నారు.