వినాయక్‌నగర్, మార్చి 2: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి విడుత జాబితాను ఆ పార్టీ అధిష్టానం శనివారం సాయంత్రం ప్రకటించింది. ఇందులో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీబీ పాటిల్‌కు అవకాశం కల్పించింది. బీబీ పాటిల్ రెండు రోజుల క్రితమే బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన వెంటనే ఎంపీ సీటు కేటాయించడం గమనార్హం.