ఖలీల్వాడి, జూన్ 22 : నగర ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ పోరాడుతానని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. మాధవ్నగర్ సమీపంలోని బీఎల్ఎన్ గార్డెన్లో పట్టణ పద్మశాలీ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగాహాజరై మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. ప్రతి పద్మశాలీ తర్పకు రూ. 5 లక్షల చొప్పున ఇచ్చామని, కల్యాణ మండపాలు, బడులకు నిధులు, శ్మశానవాటికలకు రూ. 10 లక్షల చొ ప్పున మొత్తం రూ. 8 కోట్లు సంఘాలకు అందజేసినట్లు వివరించారు. కార్యవర్గ ప్రమా ణ స్వీకారం అనంతరం పట్ట ణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో బిగాల గణేశ్ గుప్తాను ఘనంగా సన్మానించారు.