సీఎం సభా ఏర్పాట్ల పరిశీలన
నగరంలోని గిరిరాజ్ కళాశాల గ్రౌండ్లో బుధవారం నిర్వహించే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను బిగాల గణేశ్‌గుప్తా మంగళవారం పరిశీలించారు. సభ వద్ద చేయించాల్సిన ఏర్పాట్లపై నాయకులకు పలు సూచనలు చేశారు.
ఖలీల్‌వాడి/ డిచ్పల్లి, నవంబర్ 14 : నగరంలోని గిరిరాజ్ కళాశాల గ్రౌండ్లో బుధవారం నిర్వహించే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను బిగాల గణేశ్‌గుప్తా మంగళవారం పరిశీలించారు. సభ వద్ద చేయించాల్సిన ఏర్పాట్లపై నాయకులకు పలు సూచనలు చేశారు. బిగాల వెంట నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సుజిత్‌సింగ్ ఠాకూర్, సూదం రవి, సత్యప్రకాశ్, ముచ్కూర్ నవీన్, ఆర్ఎల్.నర్సింహ, కరిపె రాజు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలకేంద్రంలోని గాంధీనగర్ వద్ద ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాదసభ ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.. మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. సభాస్థలి వద్ద పూర్తి ఏర్పాట్లు చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. సభాస్థలికి కొద్ది దూరంలోనే సీఎం హెలిప్యాడ్ స్థలాన్ని సైతం ఆయన పరిశీలించారు. సభకు రూరల్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరానున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కృష్ణ, నయీం, ఒడ్డెం నర్సయ్య, అమీర్, అంజయ్య, రాజు, ఆసది రవీందర్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

