Indiramma houses | పెద్ద కొడప్ గల్ (పిట్లం), మే 22 : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలనే ధృడ సంకల్పంతో పని చేస్తుందని, జుక్కల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంబిగే హన్మండ్లు, ఎంపీడీఓ కమలాకర్, పంచాయతీ కార్యదర్శి బలరాం, నాయకులు మోహన్ రెడ్డి, బొడ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.