Better services | రెంజల్, ఆగస్టు 21 : రెంజల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారి వినయ్‌కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ నిర్వహణ, సిబ్బంది పనితీరును ఆయన గురువారం తనిఖీ చేశారు.
అత్యవసర పరిస్థితిలో సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయడం పట్ల డాక్టర్ వినయ్ కుమార్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సంజీవ్ గౌడ్, నయుముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.