కామారెడ్డి రూరల్, జూలై 4: తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీవాసులు స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించి ఏండ్లు గడుస్తున్నా పట్టాలివ్వడం లేదని వాపోయారు.
దీంతో ఆధార్‌కార్డుతోపాటు ఇతర గుర్తింపు కార్డుల్లో ఇంటి నంబరులేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి, తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తాజుద్దీన్, హైమద్,భాస్కర్, పురుషోత్తం, జంగం స్వామి, కాలనీవాసులు పాల్గొన్నారు.