పెద్ద కొడపగల్ : బ్యాంకు (Banks) , ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తున్న సమయంలో చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులుంటే జాగ్రత్తగా ఉండాలని స్థానిక ఎస్సై మహేందర్ (SI Mahender ) అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు (Canara Bank) వద్ద కస్టమర్లకు అవగాహన సదస్సు (Awareness) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి, తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, మీ ఏటీఎం, మొబైల్ నంబర్, ఓటీపీ (OTP) చెప్పాలని వివరాలు అడిగితే ఇవ్వవద్దని సూచించారు. అనుమానం ఉంటే బ్యాంకు మేనేజర్‌ను (Bank Manager ) కలవడం గాని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డబ్బులు డ్రా చేయడానికి గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డును ఇవ్వకూడదని సూచించారు .కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.