భీమ్‌గల్, మే 12: మైనర్‌పై లైంగికదాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని, మంత్రి వర్గం నుంచి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు భీమ్‌గల్‌లో మంగళవారం ఆందోళన చేపట్టారు. బండి సంజయ్, బండి భగీరథ్ చిత్రపటాలను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ, ఎంపీపీ చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేశ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ భేటీ బచావో, భేటీ పడావో అంటూ నినాదాలు ఇస్తున్నారని, కానీ తెలంగాణలో మాత్రం సాక్షాత్తూ ఆయన మంత్రివర్గంలోని మంత్రి కుమారుడే ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడితే ఒక్క మాట మాట్లాడడంలేదన్నారు. పొక్సో కేసు నమోదై రెండు రోజులైనా భగీరథ్‌ను అరెస్టు చేయడంలో నెలకొన్న నిర్లక్ష్యం రాష్ట్ర పోలీసు పనితీరును సూచిస్తున్నదన్నారు.
అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్న రేవంత్ సర్కార్
రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలుచేయకుండా అధికారం, డబ్బు ఉన్న వారికి ఒక న్యాయం, సాధారణ వ్యక్తులకు మరో న్యాయం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పని చేయడంలేదన్నారు. సాక్షాత్తూ ఐఏఎస్ అధికారి భార్యను చంపినా, మిట్ట మద్యాహ్నం కరీంనగర్లో బంగారం షాపులో చోరీ జరిగినా, మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినా ఏమీ చేయలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కేసులు పెట్టి జైల్లో వేసి వేధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నాయకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బండి సంజయ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గు ఉంటే బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయించాలన్నారు.
భగీరథ్‌ను అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు
రుద్రూర్(వర్ని), మే 12: బండి భగీరథ్‌ను పొక్సో కేసు కింద అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్, తహసీల్ కార్యాలయంలో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో మండల ఇన్చార్జి గాండ్ల మధు, దౌడ్ సాయిలు, రవి కిరణ్, వం జరి గోపి, పార్వతి ప్రవీణ్, షేక్ స లీం, హాజి, కిజర్, శ్రవణ్, శేఖర్ ఉన్నారు.
భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలి
సిరికొండ, మే12: మైనర్‌పై లైంగికదాడికి పాల్పడిన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పీవోడబ్ల్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పిట్ల రమ డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె గడ్కోల్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని చూసుకొని మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. లైంగిక దా డులు, హింస పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. బం డి సంజయ్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు జ మున, గంగామణి, సావిత్రి, బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.