Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయ తృతీయ పుష్కర కుంబాభిషేకం సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం గణపతి హోమం, శత చండి హోమం, అయ్యప్ప స్వామికి అభిషేకాలు, మహా పడిపూజ, నైవేద్యాలు తదితర పూజలు అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించారు.
అనంతరం అయ్యప్ప స్వాములకు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు నస్కంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోని శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నం రమేష్, అన్నదాన సేవా సంఘం అధ్యక్షుడు మానస రాజేందర్, నూకల ఉదయ్, కుంబాల రవి యాదవ్, పంపరి లక్ష్మణ్, నక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.