Banswada | బాన్సువాడ రూరల్, జూన్ 12 : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్, ఇబ్రహీంపేట్ గ్రామాలలో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో పూర్వప్రాథమిక విద్యపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మండల విద్యాధికారి నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ప్రీప్రైమరి విద్యావ్యవస్థను తీసుకొచ్చిందని అన్నారు. 4 సంవత్సరాలు దాటిన చిన్నారుల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామ సర్పంచు భూనేకర్ జ్యోతి, ప్రధానోపాధ్యాయులు రాఘవేందర్, నివేధిత, జాగృతి, ఉపాధ్యాయులు కుషాల్, నర్వ శ్రీనివాస్, మంద ప్రవీణ్, రామకృష్ణ, సంతోష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.