ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటాం.. నిందితులకు శిక్ష పడేలా ఒత్తిడి తెస్తాం
ఏపీలోని రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు.
- న్యాయ పోరాటానికి లీగల్ సెల్ ద్వారా సలహాలు, సూచనలు అందజేసేలా చూస్తాం
- బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- మెడికో తండ్రి వెంకటేశ్‌కు ఫోన్లో భరోసా
అయిజ, ఆగస్టు 12 : ఏపీలోని రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్పురంలో ప్రియాంక కుటుంబ సభ్యులను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. ప్రియాంక చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ప్రియాంక తండ్రి వెంకటేశ్‌తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొన్నారు.
మెడికో ప్రియాంక మృతి బాధాకరమని అన్నారు. తెలంగాణ ప్రజానీకానికి వైద్యసేవలు అందించనున్న తరుణంలో డాక్టర్ మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తండ్రి న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ సలహాలు, సూచనలు చేస్తుందని హామీ ఇచ్చారు. డాక్టర్ కుటుంబానికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. నిందితులు ఎంతటి వారైనా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా ఏపీ సర్కార్‌పై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, ఘటనకు కారణమైన వారికి శిక్ష పడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి : ఎమ్మెల్యే
మృతి చెందిన ప్రియాంక కుటుంబానికి ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు చెరో రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

