వినాయక్‌నగర్, జూన్ 26 : అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా గురువారం అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి అధికారులు బహుమతులు అందజేశారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వక్తలు సూచించారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలను జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ప్రారంభించారు.