Red Cross membership | భిక్కనూరు, జూలై 30 : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో భారత రెడ్‌క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా శాఖ, జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రెడ్‌క్రాస్ స్పెషల్ మెంబర్షిప్ అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్‌క్రాస్ నోడల్ అధికారి శశికుమార్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సభ్యత్వం ద్వారా సమాజ సేవలో భాగస్వాములు కావచ్చని తెలిపారు. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు, రక్తదాన శిబిరాలు, నిరుపేదలు, విద్యార్థులకు సహాయం వంటి సేవల్లో రెడ్‌క్రాస్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఆర్కే డిగ్రీ కళాశాల డైరెక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలో అత్యధిక రెడ్‌క్రాస్ సభ్యత్వాలు కలిగిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు. సభ్యత్వ నమోదు గడువు శుక్రవారంతో ముగియనున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ అధ్యక్షత వహించగా బిక్నూర్ ఎమ్మార్వో సునీత, ఎంపీడీవో రాజ్‌కిరణ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్లు అంజయ్య, హరిత, అధ్యాపకులు డాక్టర్లు మోహన్ బాబు, లలిత, సబిత, టీ ప్రతిజ్ఞ, ఎస్. నారాయణ గుప్తా, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.